సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే అందరికీ వ్యాల్యూ ఉంటుంది.లేదంటే వారిని ఎవరు కూడా ఏ మాత్రం పట్టించుకోరు. ఈ విషయంలో హీరోలు కూడా అతిథులేమీ కాదు. సక్సెస్ వెనక పరుగులు తీయకుండా ఉంటే వారి పని అంతే. ఆ విధంగా ఇప్పుడు కొంత మంది హీరోయిన్ లు తమ కెరియర్ ను ముందుకు తీసుకువెళ్ళే విధంగా తమ భవిష్యత్తును బాగా తీర్చి దిద్దుకునే విధంగా సినిమాలను చేస్తూ పాపులారిటీని అందుకుంటున్నారు. అయితే ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం సక్సెస్ సాధించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.
హీరోల కంటే హీరోయిన్ ల కెరీర్ చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ సమయం లోనే సక్సెస్ విషయంలో వారు చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా తక్కువ కాలం పరిమిత కాలం ఉంటుంది కాబట్టి తొందరగా వారిని వారు నిరూపించుకోవాలి లేదంటే వారు ఫాస్ట్ గా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా రాశీ ఎప్పటినుంచో విజయ బాటలో నడవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె ఇప్పటివరకు హిట్ ట్రాక్ లోకి రాకపోవడం స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. మరి ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలతో విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.
మరొక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి చాలా రోజులు అయింది. చాలా సినిమాలు చేసినా కూడా ఈమెకు ఎందుకు పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదంటే ఏమో అనే చెప్పాలి. ఇతర కుర్ర హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే టాప్ హీరోయిన్ అవుతుంటే అనుపమ మాత్రం అన్ని అర్హతలు ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది. మరి ఈ ఇద్దరు హీరోయిన్ లు ఎప్పుడు తమ అదృష్టాన్ని మార్చుకుంటారో చూడాలి. ప్రస్తుతం కొన్ని మంచి క్రేజీ సినిమాలే వీరు చేస్తున్నారు.