వామ్మో: కొత్త సినిమా వస్తే.. వంద టికెట్లు ఇవ్వాల్సిందే.. ఓ నేత లేఖ వైరల్..!!

Divya
సినిమా ఆంధ్రప్రదేశ్లోని టికెట్ల రేట్లు వ్యవహారం గత కొద్ది రోజుల క్రితమే ముగిసింది.. ఇక ఆన్లైన్ టికెట్ ల పేరిట మొన్నటి వరకు సాగిన గొడవలకు ఏపీ సీఎం గత రెండు రోజుల క్రిందటే తరలించడం జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీలోని వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు తాజాగా మరో కలకలం రేపుతోంది.. అదేమిటంటే ఏదైనా కొత్త సినిమా విడుదలైంది అంటే చాలు తమకు వాటా కావాలని కొంతమంది నేతలు థియేటర్ యాజమాన్యాలకు ఒక లేఖ రాయడంతో ఇప్పుడు అది చాలా వైరల్ గా మారుతున్నది..


ఆంధ్రప్రదేశ్లోని సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి ఫైట్ కొనసాగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. సినీ ఇండస్ట్రీ లో ఉండే సమస్యలపై కొంతమంది పెద్దలు కలిసి మళ్ళీ చర్చలు జరపడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గతంలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ డే సినిమా ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు చాలా వివాదానికి దారితీశాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకున్నట్లుగానే భీమ్లా నాయక్ సినిమా విడుదలైన వెంటనే కొద్ది రోజుల గ్యాప్ తో ఒక సరికొత్త జీవోను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా వివాదం కాస్త సద్దుమణిగింది అని చెప్పవచ్చు.
ఇప్పుడు తాజాగా వైసీపీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి రాసిన ఒక లేఖ పెను సంచలనంగా మారుతోంది.. సినిమా థియేటర్లకు ఓ పెద్ద నగరానికి చెందిన మేయర్ పేరుతో ఒక లేఖను కూడా రాయడం జరుగుతోంది. ప్రస్తుతం ఆ లేఖ చాలా వైరల్ గా మారుతోంది.. దీంతో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది ఈ లేఖ. ఇక ఆ కార్పొరేషన్ పరిధిలో ఉండే థియేటర్లలో టికెట్ కావాలని ఆ పార్టీ అధికారులు, కార్పొరేటర్లు కోరుతున్నట్లుగా ఆ లేఖలో తెలియజేయడం జరుగుతోంది. అయితే ఈ లేక ఒరిజినలా లేక డూప్లికేటా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: