అమ్మో.. రష్మిక ఇలా మారిందేంటి?

Satvika
ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ల హడావిడి మాములుగా ఉండదు.. అలాంటి వరుస హిట్ సినిమాలు పడితే ఆ హీరోయిన్ ఇంక మాములుగా ఉంటుందా.. రచ్చ చెస్తుంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన సినిమా విషెషాలతో పాటుగా లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.. టాప్ హీరోయిన్లుగా రానిస్తున్న వారంతా ఇలానే ఉన్నారు. అందులో ముందు వరుసలో బ్యూటీఫుల్ హిరోయిన్ రష్మిక మందన్న ఒకరు.. తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల లో నటిస్తూ మంచి జోష్ లో ఉంది. సోషల్ మీడియాలో కూడా అంతే చురుగ్గా ఉంది.


రష్మిక ఇప్పటివరకు చేస్తూ వచ్చిన సినిమాలు అన్నీ  హిట్ కావడంతో ‘గోల్డెన్ లెగ్’ అనే ముద్ర వేసుకుంది. అంతే క్రేజ్ తో వరుస సినిమాలను చేస్తూ వస్తుంది. ఇక దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో భారీ హిట్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. మొన్నీమద్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.పుష్ప కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో విజయవంతం కావడంతో పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యి రష్మికకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికల్లో ఒకరిగా ఉన్న కన్నడ బ్యూటీ.. ఇప్పుడీ జోరును హిందీలో కూడా కొనసాగిస్తుంది.


బాలీవుడ్‌లో ఇప్పటికే ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌బై’ చిత్రాలు పూర్తి చేశారు. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కానున్నాయి. ఇది ఇలా ఉండగా రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తో చేస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. బీచ్‌లో ఓ పాటను షూట్ చేస్తున్నారు.. అప్పుడు కాస్త బ్రేక్ దొరకడం తో ఆ ఇద్దరు బీచ్ లో మరో పాటకు డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విజయ్ నటిస్తోన్న బీస్ట్ చిత్రంలోని హలమితి హబిబో సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలుసు. ఆ పాటకు చాలా మంది హీరోయిన్లు డ్యాన్స్ వేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా వేయడంతో మరింత క్రేజ్ ను అందుకుంది.. ప్రస్తుతం అమ్మడు విజయ్ తో ఒక సినిమా చెస్తుంది. తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప 2 లో నటిస్తుంది. అంతేకాదు ఓ మ్యాగ్జైన్ కోసం బోల్డ్ గా ఫోటో షూట్ చేయడం తో నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: