పెళ్లయిన కొన్ని రోజులకే భర్తలను పోగొట్టుకున్న నటీమణులు వీళ్ళే..!!
కవిత..
సీనియర్ నటి కవిత ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఏమీ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కవిత అనేకమైన సినిమాలలో నటించడం జరిగింది.అయితే ఈమె భర్త దశరథ రాజు కరోనా కారణంగా మరణించడం జరిగింది. తర్వాత నుండి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది కవిత.
మేఘనారాజ్...
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చూడ ముచ్చటైన జంట వీరిది. ఇకపోతే చిరంజీవి రెండేళ్ళకే గుండెపోటుతో కన్ను వేయడం జరిగింది ఇక ఆయన చనిపోయినప్పుడు ఆమె భార్య 5వ నెల గర్భవతి గా ఉంది ప్రస్తుతం కొడుకుతో మరియు కుటుంబంతో కలిసి ఉంటుంది.
భానుప్రియ...
భానుప్రియ ఆదర్శ కౌశల్ ని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే అక్కడ పాప జన్మించిన తర్వాత భర్తతో తగాదాలు ఏర్పడడంతో ఆమె ఇండియా వచ్చింది . అయితే అక్కడ ఆదర్శ కౌశల్ మరణించడంతో భాను ప్రియ అక్కడికి వెళ్లి దగ్గరుండి అతని అంత్యక్రియలు పూర్తి చేసింది.
సురేఖ వాణి...
సురేఖ వాణి ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈమె కూడా చాలా చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయింది.కాగా ఈయన పలు షోలకు టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పని చేసేవారు. అయితే అంతేకాదు వీరిద్దరిదీ ప్రేమ వివాహం.కాగా ఆయన మరణించడంతో తన కూతురు సుప్రీత తో కలిసి జీవిస్తోంది.
రేఖ...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రేఖ.ఈమె తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది.అయితే ఈమె హాట్ లైన్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ ను ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లి తరువాత ముఖేష్ కి గతంలోనే పెళ్లి జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది.దాని తరువాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.కాగా దాని అనంతరం విడిపోయారు.అయితే రేఖతో విడాకులు జరగడం. తరువాత వ్యాపారంలో నష్టాలతో ఆత్మ హత్య చేసుకున్నాడు.