అఖిల్ సార్ధక్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.మనోడు బిగ్ బాస్ షోతో మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీలో కూడా బాగా సందడి చేస్తున్నాడు. ఇక సిసింద్రి సినిమా విడుదలైన మరుసటి రోజే ఇతను జన్మించడంతో కుటుంబ సభ్యులు ఇతనికి అఖిల్ అని పేరు పెట్టారని ఇతను పలుమార్లు చెప్పుకొచ్చాడు.ఇక రెండేళ్ల క్రితమే లవ్ ఫెయిల్ అయిందని కాబట్టి ప్రస్తుతం సింగిల్ అని అతడు చెప్తున్నాడు. ఇక హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అఖిల్ సార్థక్ మూడో స్థానం సంపాదించాడు. పలు సీరియల్స్‌లో కూడా అఖిల్ నటించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తను తనలాగే ఉంటానని ఇంకా నటించాల్సిన అవసరం అసలు లేదని అఖిల్ చెప్తున్నాడు. ఇక అలాగే ఓటీటీ సీజన్లో కాస్త స్టైల్ మార్చిన అఖిల్ ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.అలాగే మరోవైపు అఖిల్ డ్యాన్స్ షో అయిన ఢీలోను పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ స్థానంలో అఖిల్‌ని తీసుకు రాగా, మనోడితో మాత్రం పెద్దగా వినోదం లేదనే టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే తాజాగా ఢీ షోకి సంబంధించి ప్రోమో ఒకటి విడుదల కాగా, ఈ ప్రోమోలో అఖిల్‌ని ఓ ఆట ఆడుకున్నారు హైపర్ ఆది, ప్రదీప్.
ఇక ఇంతకి విషయం ఏమిటంటే మేం బాగా ప్రిపేర్ అయి వచ్చాం అని ఆది అనగా, అవసరం లేదు అని ప్రదీప్ వెంటనే అంటాడు. దానికి ఆదిని ఇది నీ రేంజ్ అని అఖిల్ సార్థక్ అనగా, నిన్నే అనింది అంటూ అఖిల్ కి పంచ్ వేస్తాడు ప్రదీప్. మధ్యలో కూడా మనోడిపై పంచ్‌లు అనేవి బాగా పేలాయి.స్టార్టింగ్ నుంచి కూడా పేలుతున్నాయి. ఇక జానీ మాస్టర్‌పై అఖిల్ కామెంట్ చేసిన సమయంలో మనోడితో బాగా ఆడుకున్నారు ప్రదీప్, ఆది.అయితే ఇదంతా పక్కన పెడితే అఖిల్ లుక్స్ కి మాత్రం ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. కాని బిగ్ బాస్ ఓటిటిలో మాత్రం అఖిల్ హెయిర్ స్టైల్ అసలు బాగా లేదని కామెంట్స్ వస్తున్నాయి.కాని వున్న హౌస్ మేట్స్ లో అఖిల్ అంటే చాలా మందికి తెలుసు కాబట్టి అతనికి ఓటింగ్స్ అనేవి బాగా పడుతున్నాయి.