రాఖీ బాయ్.. ఇలా అయితే ఎలా..!!
డైరెక్టర్ ప్రశాంత్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని కన్నడ సినీ పరిశ్రమలో ఒక తిరుగులేని చిత్రంగా నిలుస్తుందని ఎవరు ఊహించలేకపోయారట. కానీ ఎట్టకేలకు ఒక అద్భుతం జరిగింది.. కే జి ఎఫ్ -1 తోనే అటు తెలుగు , తమిళ , హిందీ భాషల్లో కూడా సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతోంది. దీంతో ఇక ఈ సినిమా పాటల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రబృందం. అయితే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా టీజర్ విడుదలై ఇప్పటికి దాదాపుగా ఒక సంవత్సరం కావస్తోంది. అయితే ఇక ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. కానీ అప్పుడప్పుడు కొన్ని పోస్టర్లను మాత్రమే విడుదల చేస్తూ ఉంటారు.
అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక మహిళా పాత్రను విడుదల చేయడం జరిగింది. పూర్తిగా డార్క్ థీమ్ లో ఉన్న ఈ పోస్టర్ ఎవరిని ఎట్రాక్ట్ చేయలేకపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా పై కొంతమంది అభిమానులు చాలా డల్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా విడుదల అవడానికి కేవలం ఒక నెల మాత్రమే ఉన్నది ఇలాంటి సమయంలో ఇంతటి పబ్లిసిటీ చేస్తే ఎలా అని అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. మరి ఈ సినిమాకు ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.