ప్రస్తుతం ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎ రేంజ్ లో ఆదరిస్తున్నారో మన అందరికీ తెలిసిందే, అలా ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ లను ఆదరించడంతో స్టార్ హీరో లు, హీరోయిన్ లు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఫుల్ గా ఆసక్తి చూపుతున్నారు, అందులో భాగంగా ఇప్పటికే తమన్నా , సమంత , కాజల్ అగర్వాల్ లాంటి ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ లు కూడా వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను అలరించారు, అలాగే కొంత మంది హీరోలు కూడా ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ లలో నటించారు, ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన ఒకరు, ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కూడా దూత అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు నాగ చైతన్య తో ఇప్పటికే మనం సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు, ప్రస్తుతం కూడా నాగ చైతన్య , విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో థాంక్యూ అనే సినిమా తెరకెక్కుతోంది.
థాంక్యూ సినిమా నుండి ఇప్పటికే ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య , విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో లీడ్ హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలో మలయాళ నటి పార్వతి నటించనున్నారు, ప్రస్తుతం నాగ చైతన్య, ప్రియా భవానీశంకర్, పార్వతీ ల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం, ఇది ఇలా ఉంటే అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమా దూత వెబ్ సిరీస్ తో పాటు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ద సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమా తో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.