ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.యు.వి.క్రియేషన్స్ వారు దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడం జరిగింది.ఇక మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ బిజినెస్ అనేది కూడా జరగాల్సిందే. ప్రభాస్ సినిమా అవ్వడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది అంటూ వార్తలు అనేవి వస్తున్నాయి. అలాగే నిర్మాతల కు భారీగా లాభాలు దక్కే విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయ్యిందట.ఇక ఈ సినిమా దాదాపు రూ. 205 కోట్ల థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 105 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం.అలాగే ఈ సినిమా దాదాపు గా 200 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా చేసింది.
ఇక విడుదలకు ముందే నిర్మాతకు రూ. 400 కోట్ల కు పైగా లాభం వచ్చినట్లయిందట. ఇక రూ. 210 కోట్లు షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా సమాచారం తెలుస్తుంది. పది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని చాలా నమ్మకం తో ఈ సినిమా మేకర్స్ ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఇంకా ఆయన ఛరిష్మా నేపథ్యంలో ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం. కాబట్టి ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేస్తుందని అందరూ నమ్ముతున్నారు.ఈ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ భారీ సినిమా అవ్వడం తో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా బాహుబలి వసూళ్లను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది అంటూ ప్రభాస్ అభిమానులు చాలా నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.ఇక చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో అనేది.