రష్మిక వర్కౌట్ వీడియో.. ఎంత కష్టపడుతుందో చూడండి?
చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రస్మిక మందన్న ఇక ఇప్పుడు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన. తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉంటుంది ఈ కన్నడ భామ. ఇక పుష్ప సినిమాతో డి గ్లామర్ పాత్రలో అయినా సరే నటించేందుకు నేను రెడీ అంటూ దర్శక నిర్మాతలు అందరికీ చెప్పకనే చెప్పింది ఈ అమ్మడు. ఫిట్నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక అప్పుడప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే కరణ్ సానే విండో ఇంటెన్స్ ట్రైనింగ్ సెషన్ కు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో రష్మిక మందన్న వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక జిమ్ కోచ్ కరణ్ సానే ను ఫాలో అవుతూ రన్నింగ్ సెషన్ లో ప్రాక్టీస్ చేసింది రష్మిక మందన్న. రష్మిక, నేను విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం మీరు ఒత్తిడికి లోనైనప్పుడు మీతో మీరు మాట్లాడుతున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అంటూ ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కరణ్ సానే ఒక క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత కోపం రష్మిక ఎంత కష్టపడుతుందో అని అనుకుంటున్నారు అభిమానులు.