షాక్: ఈ హీరోయిన్ కి ఆ విషయం అర్థం కావడానికి 30 ఏళ్లు పట్టిందట..!!
గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ఈమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఆకట్టుకుంది. కేవలం నటన మాత్రమే కాదు మ్యూజిక్ తో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్న శృతిహాసన్ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా కొత్తదనం కోసం ప్రయత్నించేటప్పుడు కూడా తనలో లోపాలు.. బలహీనతలు కూడా ఉన్నాయట.
కొందరు తమలో దాగివున్న భయాలను ,బలహీనతలను, లోపాలను దాచి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.. లేదంటే ఏదైనా ఒక రూపంలో తెలియజేయడానికి ముందుకొస్తారు. కానీ నేను నా భయాలను, బలహీనతలను ఏదైనా రచన లేదా పాట రూపంలో చాలా విభిన్నంగా బయట పెడతాను అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఒక మనిషి యొక్క బలహీనత అనేది ఒక రూపంలో బయట పెట్టడం వల్ల జనాలు వారిని గౌరవిస్తారు అని కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తనకు 30 సంవత్సరాల సమయం పట్టింది అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.. ఇకపోతే బలహీనతలను బయట పెట్టడానికి మార్గాలు చాలానే ఉన్నా.. బయట పెట్టే విధానాన్ని బట్టి అవతల వారి నుండి మనం గౌరవాన్ని పొందవచ్చు అంటూ తన మనసులోని మాటను వివరించింది ఈ ముద్దుగుమ్మ.