హ్యాపీ ఉమెన్స్ డే : బాస్ లేడీ అంటూ ఛార్మి పై పూరి అద్భుత స్టేట్మెంట్ .... ??

GVK Writings
సర్వమానవాళి మనుగడకు స్త్రీమూర్తి మూలాధారం. నిజంగా తన రక్తమాంసాలతో మరొక ప్రాణికి జీవంపోసి ఈ భువి మీదకు తీసుకురాగల గొప్ప శక్తిని కేవలం స్త్రీమూర్తికి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. మన పెద్దవారు చెప్పినట్లు ఆఖరికి ఆ భగవంతుడు కూడా అమ్మ గర్భం నుండి జనియించవలసిందే అనేది నర్మగర్భ సత్యం. ఇక కొన్నేళ్లుగా విశ్వవ్యాప్తంగా ఏటేటా ఎంతో గొప్పగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మానవాళి జరుపుకుంటోంది. ఒకప్పటితో పోలిస్తే నేడు స్త్రీలు అన్ని రంగాల్లో కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా, మరికొన్ని రంగాల్లో అయితే మరింత గొప్పగా రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు.
ఇక ప్రస్తుతం మనం చెపుకోబోతోంది సినిమా రంగంలో నటిగా, నిర్మాతగా తనకంటూ తెలుగు ప్రేక్షకాభిమానుల మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్న ఛార్మి గురించి. నీతోడు కావాలి సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా పరిచయం అయిన ఛార్మి, ఆ తరువాత తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఒక్కొక్కటిగా ఎన్నో గొప్ప అవకాశాలు అందుకున్నారు. ఇక తాను పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఛార్మి, కొన్నేళ్ల క్రితం అద్భుత దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా నిర్మాతగా మారారు. అప్పటి నుండి పూరి తీస్తున్న ప్రతి సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తూ తనలోని మరొక అద్భుత ప్రతిభని వెలికితీశారు. ఇప్పటివరకు తాను తీసిన చాలా సినిమాలకు సహనిర్మాతగా పని చేసిన ఛార్మిపై నేడు మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ అండ్ టీమ్ అయిన పూరి కనెక్ట్స వారు ఒక వ్యాఖ్యానం రూపంలో ఆమె గొప్పతనాన్ని, ప్రతిభని గౌరవించారు.
మీరు తెలుగు చిత్ర సీమలో నటిగా ఎంతో గొప్ప పేరు గడించిన అనంతరం మా పూరి కనెక్ట్స్ సంస్థ తరపున దర్శకుడు పూరి జగన్నాథ్ తీస్తున్న ప్రతి చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీలోని అద్భుత ప్రతిభ, పని పట్ల మీకు ఉన్న జిజ్ఞాస, ఉత్సుకత, మీరు చేసే కఠోర శ్రమ, మా బృందం లోని ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అలానే పనిపట్ల అంకిత భావం, ఏ విషయంలో అయినా ఒకటికి రెండు సార్లు ఎంతో నిశితంగా ఆలోచన చేసి ముందుకు సాగెతత్వం, వీటన్నటితో పాటు ముఖ్యంగా ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనేలా సెట్ లోని ప్రతి ఒక్కరితో సరదాగా కలిసిపోయి వ్యవహరించే తీరు ఎందరికో ఆదర్శం. ఆ విధంగా బాస్ లేడీ గా మా పూరి కనెక్ట్స్ సంస్థకి మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టిన మీరు రాబోయే రోజుల్లో వృత్తి పరంగా, అలానే జీవితంలో మరెన్నో ఉన్నతశిఖరాలు అందుకోవాలని అభిలషిస్తున్నాము. మీకు మా సంస్థ తరపున ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వారు పోస్ట్ చేసిన వ్యాఖ్యాన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: