పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కొన్ని విషయాల్లో మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా వుంటారు. అయితే అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ స్టార్
హీరో అభిమాని లేదా అభిమాని కుటుంబం కష్టాల్లో ఉందని తెలిస్తే సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు.ఇక తాజాగా పవన్
కళ్యాణ్ అభిమాని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే పవన్
కళ్యాణ్ అభిమాని అయిన తవిటికి
వెంకటేష్ అనే వ్యక్తి అమలాపురం డివిజన్ లోని జనుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా
వెంకటేష్ తాజాగా ప్రమాదవశాత్తూ మరణించారు.ఇకపోతే సాధారణంగా
జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్నవాళ్లు..
ప్రమాదంలో మరణిస్తే
పార్టీ నుంచి అభిమాని కుటుంబ సభ్యులకు సహాయం అందుతుంది.ఇకపోతే తవిటికి
వెంకటేష్ కు
జనసేన పార్టీలో సభ్యత్వం లేకపోయినా
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ అతని కుటుంబానికి సహాయం చేశారు.ఇదిలావుండగా పవన్
కళ్యాణ్ గతంలో కూడా ఇదే విధంగా సహాయాలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే అభిమానులను కుటుంబ సభ్యుల్లా చూసే పవన్ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సాయం చేసే విషయంలో వెనుకడుగు వేయరు.ప్రస్తుతం పవన్ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇక తాజాగా భీమ్లా
నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పటికే ఈ
సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.దగ్గబాటి
రానా మరో హీరోగా నటించిన ఈ సినిమాని
యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా..
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం
సినిమా సినిమాకు పవన్
కళ్యాణ్ మార్కెట్ ను పెంచుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.ఇకపోతే ఇటీవలే తమిళంలో మంచి విజయం సాధించింన 'వినోదాయ సిత్తం'
సినిమా రీమేక్ లో పవన్ త్వరలో నటిస్తారని ప్రచారం జరుగుతుంది.మెగా
హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ
రీమేక్ లో కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది...!!