మరో టాప్ దర్శకుడు పుట్టుకొచ్చినట్లే.. అదిరిపోయే ప్రాజెక్ట్..!!
వాస్తవానికి పవన్ కళ్యాణ్ రానా లాంటి పెద్ద హీరోలను టేకప్ చేసి హిట్ సినిమా చేయడం అంటే ఏ దర్శకుడికైనా అది కత్తిమీద సాములాంటిదే. అలాంటి పరిస్థితి నుంచి సాగర్ చంద్ర త్వరగా అలవాటు పడి ఇప్పుడు ఇంతటి విజయవంతమైన సినిమా చేయడం నిజంగా మంచి విషయమని చెప్పాలి. ఏదేమైనా సాగర్ చంద్ర ఈ సినిమా తో టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత కూడా అయన పెద్ద హీరో తో సినిమా చేసే విధంగా ముందుకు వెళ్లడం విశేషం.
వరుణ్ తేజ్ తో అయన సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజం చేస్తూ ఈ సినిమా విడుదల అయినా కొన్ని రోజులలోనే సాగర్ చంద్ర నెక్స్ట్ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ సినిమా మొదలుకానుంది. గని సినిమా ను విడుదల కు సిద్ధం చేసిన వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇది కూడా మంచి హిట్ అయితే కనుక తప్పకుండ సాగర్ చంద్ర కి మంచి పేరు రావడం గ్యారెంటీ. మరి సాగర్ చంద్ర అంచనాలకు తగ్గట్లు గా సినిమాలు చేసి హిట్ లు సాధిస్తాడా చూడాలి.