డబ్బు ఉంటే ఒక గోల... లేకపోతే ఒక గోల... జగపతి బాబు..!

Pulgam Srinivas
నటుడు జగపతి బాబు గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  హీరోగా కెరియర్ ని మొదలు పెట్టిన జగత్ బాబు తన కెరియర్ లో ఎంతోమంది లేడీ అభిమానులను సంపాదించుకున్నాడు,  అలాంటి జగపతి బాబు కెరియర్ లో హీరోగా వరుస అపజయలను ఎదుర్కొంటున్న సమయంలో నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన లెజెండ్ సినిమాలో  విలన్ పాత్ర లో నటించాడు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ నిలవడం మాత్రమే కాకుండా  జగపతి బాబు విలన్ పాత్రతో ఎంతో మంది  ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు,  జగపతి బాబు కు లెజెండ్ సినిమా తర్వాత  క్రేజీ సినిమా లలో విలన్ పాత్రలు దక్కాయి,  జగపతి బాబు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా ప్రతినాయకుడి పాత్ర లో నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు.


 జగపతి బాబు ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు,  ఇది ఇలా ఉంటే జగపతి బాబు కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జగపతి బాబు సలార్, గని, రాధే శ్యామ్ మూవీ లలో కీలక పాత్ర లో నటిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజా గా జగపతి బాబు ఆయన  కుటుంబ సభ్యులతో దుబాయ్‌ విహారానికి వెళ్లారు,  అక్కడ షాపింగ్ చేసి ఇన్ స్టా లో జగపతి బాబు ఒక ఫోటో ని పోస్ట్ చేసి...  డబ్బు ఉంటే ఒక గోల... డబ్బు లేకపోతే ఒక గోల అంటూ ఈ ఫోటో కు క్యాప్షన్ రాసుకొచ్చాడు, ప్రస్తుతం జగపతి బాబు కామెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: