దగ్గుబాటి
రానా హీరోగా ఎంట్రీ ఇచ్చింది 'లీడర్' చిత్రంతో..! అని అందరికి తెలుసు.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2010 వ సంవత్సరం
ఫిబ్రవరి 19న విడుదలైందట.
అన్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేదు కానీ, ఇదొక క్లాసిక్
సినిమా అని చెప్పాలి.
శేఖర్ కమ్ముల మార్క్ పొలిటికల్ డ్రామాగా నిలిచింది.. ఈ కథని చాలా మంది హీరోలకి
శేఖర్ కమ్ముల వినిపించాడట
అయితే అప్పుడు కథలో మార్పులు చేయాలనే డిమాండ్ బాగా రావడంతో.. చివరికి నూతన
హీరో అయిన రానాతో ఈ మూవీని తెరకెక్కించాడట
శేఖర్ కమ్ముల .రానాకి ఇది మొదటి
సినిమా అంటే ఎవ్వరూ నమ్మరేమో.. ఎందుకంటే అతను అంత మెచ్యూర్డ్ గా నటించి మెప్పించాడు మరి.
రానా తప్ప ఈ పాత్రకి ఎవ్వరూ న్యాయం చేయలేరేమో అనేంతలా ఈ
అర్జున్ ప్రసాద్ పాత్రకి జీవం పోసాడు. ఇదిలా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని..'అరణ్య' 'లవ్ స్టోరీ' సినిమాల రిలీజ్ టైములో దర్శకుడు
శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడట..
ఇదే విషయమై రానాని కూడా ప్రశ్నించగా… అతను ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు.'భీమ్లా నాయక్' ప్రమోషన్లలో భాగంగా
రానా ఈ విషయం పై స్పందించాడట.'శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారని అలాగే మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారని చెప్పుకొచ్చాడు.. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది' అంటూ
రానా బదులిచ్చాడట . దీనిని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్ కు సంబంధించి అయితే
శేఖర్ కమ్ముల ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టేశాడని అర్ధమవుతుంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పటికి సెట్ అవుతుంది. అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాలి మరి. ప్రస్తుతం
రానా భీమ్లా
నాయక్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.