టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ సాధిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది, ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది, అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో సర్కారు వారి పాట చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి కళావతి అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసింది, ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వీక్షణల రికార్డును బ్రేక్ చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కళావతి సాంగ్ మరో ఘనతను సాధించింది, యూట్యూబ్‌లో కళావతి సాంగ్ ట్రెండింగ్‌లో 50 మిలియన్ మార్క్‌ను చేరుకుంది, అత్యంత వేగంగా టాలీవుడ్ లో 50 మిలియన్ లెస్ వ్యూస్ ను సాధించిన మొదటి సింగిల్ ఇది, ఇలా సర్కారు వారి పాట మొదటి లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మహేష్ బాబు కెరియర్ లోనే అత్యధిక ధరకు సరిగమ సంస్థ సర్కారు వారి పాట సినిమా సంగీత హక్కులను సంపాదించండి, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జి ఏం బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు, ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.