ఆ హీరోని ప్రేమిస్తున్నా.. ఓపెన్ అయిన హీరోయిన్ అనన్య?
ప్రస్తుతం యువ హీరోయిన్ గా అనన్య పాండే వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అటు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంత కాలం నుంచి ఈ హాట్ బ్యూటీ యువ హీరో ఇషాన్ కట్టర్తో ఎంతో సన్నిహితంగా ఉంటుంది.
ఇక ఇద్దరు పార్టీలకు కలిసి వెళుతుండటంతో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా లో వార్తలు రావడం మొదలైంది. ఇటీవల ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొదటి సారిగా తన ప్రేమ విషయం పై నోరు విప్పింది. నా మీద అతని ప్రభావం ఎక్కువగా ఉంది.. అతనిది ప్రేమించే వ్యక్తిత్వం.. నాకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాడు.. అతడిని ప్రేమిస్తున్నా.. నేను చాలా లక్కీ అంటూ చెప్పేసింది. అయితే ఇక ప్రియుడూ ఇషాన్ కట్టర్ పేరు మాత్రం చెప్పకపోవడం గమనార్హం..