నా తల్లి కూడా ఇంట్లోకి రానివ్వలేదు : యాంకర్ శివ
ఈ ఐదు సీజన్లలో ఖచ్చితంగా యాంకర్ శివ కంటెస్టెంట్ గా పాల్గొంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా పాల్గొనలేదు. ఇక ఇప్పుడు ఓటీటీ వేదికగా 24 గంటల పాటు ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 14వ కంటెస్టెంట్ గా హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాను తన కెరియర్ లో ఎదుర్కొన్న కష్టాలను గురించి చెప్తూ కొద్దిగా ఎమోషనల్ అయినట్టు సమాచారం. శ్రీకాకుళానికి చెందిన టువంటి శివ తన విద్యాభ్యాసాన్ని వైజాగ్లో పూర్తి చేశారు. ఒకసారి 40 వేల రూపాయలను ఖర్చు పెట్టుకొని యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసి ఆ ఫుటేజ్ ను తీసుకొని ఎడిటర్ దగ్గరకు వెళ్తే యాంకర్ గా నువ్వు పనికి రావు అని ముఖం మీది ఘోరంగా అవమానించారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
కొద్ది రోజులకు తన తల్లి కూడా ఇంట్లోకి రానివ్వలేదు అని ఆ కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాను అని చెప్పారు. అంతే కాదు ఎవరు ఏమన్నా సరే కుర్చీలో కూర్చొని ప్రశ్నించడం నాకు ఇష్టమని ఆయన తెలిపాడు . ఇకపోతే ఒక చెల్లి ఉందని ఆమెకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అని తెలిపాడు శివ. ఇక అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లో 24 గంటల పాటు మసాలాలు అందిస్తానని తెలిపాడు.