మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆరోజు సరికొత్త అప్డేట్..!!

Divya
మహేష్ బాబు గత కొన్ని రోజులుగా కొంతమంది హేటర్స్ వల్ల వివాదాలలో చిక్కుకుంటూనే ఉంటున్నారు.. అదేమిటంటే మహేష్ బాబు ఎప్పుడు ఓకే జోన్ సినిమాలను చేస్తూ ఉంటాడు అనే వివాదం. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్లందరికీ నోళ్లు మూయించేలా చేశాడు మహేష్ బాబు. తాజాగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో అందరికీ గట్టి షాక్ ఇచ్చేలా చేశాడు మహేష్ బాబు . ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా విభిన్నంగా ఉన్నట్లు మనం ఇదివరకు విడుదలైన ట్రైలర్, ఫోటో లో చూసే ఉన్నాము. మహేష్ లో ఉన్న మాస్ యాంగిల్ లో డైరెక్టర్ పరుశురామ్ చూపించడానికి చాలా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.



అయితే తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ త్వరలో రాబోతోంది అనే వార్త వినిపిస్తోంది.. అది మహాశివరాత్రి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ఉండబోతోంది అనే వార్త ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతోంది.. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయకిగా నటించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా పై హీరో,హీరోయిన్, చిత్రబృందం ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్తగా కనిపించడంతో పాటు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ దొరుకుతుందని డైరెక్టర్ పరుశురాం తెలియజేశారు.

ఇక ఈ సినిమాతో పాటుగా మహేష్ బాబు ఈ సినిమా నుంచి ఒక మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, మైత్రి మూవీ, 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇందుల యాక్టర్ వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక మహేష్ అభిమానులు ఈ చిత్రం అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఎ లా ఉంటుందో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: