భీమ్లా నాయక్ : దర్శకుడికి హాట్సాఫ్ అంతే?
భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ లు స్క్రీన్ ప్లే అందించాడు. ఇక సినిమా మొత్తం త్రివిక్రమ్ మార్కు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ సినిమా కథను అటు మలయాళం సూపర్ హిట్ మూవీ నుంచి తీసుకున్నప్పటికీ అటు తెలుగు తెలుగు ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఎన్నో మార్పులు చేర్పులు చేశారు.. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ అదిరిపోయే డైలాగులు రాసేసాడు అని చెప్పాలి. ఒక్కసారి కలం పట్టి త్రివిక్రమ్ డైలాగులు రాస్తే అవి ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్ లు ఉన్నాయి. ముఖ్యంగా భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ డానియల్ శేఖర్ గా రానా ఒదిగిపోయి నటించారు. ఇక వీరిద్దరి మధ్య డైలాగ్స్ అటు ప్రేక్షకులందరికీ పూనకాలు తెప్పిస్థాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రానా తమ నటన సినిమాకు ప్రాణం పోస్తే ఈ సినిమాకు వెన్నెముక్కగా నిలిచింది మాత్రం త్రివిక్రమ్ రాసిన డైలాగులు దర్శకుడు సాగర్కే.చంద్ర టేకింగ్ అనే చెప్పాలి. ఇలా మలయాళం మూవీ ని తెలుగు నేటివిటీ లో తెరకెక్కించడంలో దర్శకుడు ఫుల్ సక్సెస్ అయి పోయాడు..