ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించనున్న బాలీవుడ్ భామ..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ ముగించుకున్నాడు,  ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది,  కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.  ఇది ఇలా ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 25 వ తేదీన విడుదల చేయబోతున్నారు,  ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులన్నీ ముగించుకుని ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.  ఎన్టీఆర్ తదుపరి సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే,  అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'   సినిమా పనుల్లో బిజీగా ఉండటం,  కొరటాల శివ,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా డిలే అవుతూ వచ్చింది.  


అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించిన పనులన్నీ  ముగించుకోవడం,  కొరటాల శివ కూడా ఆచార్య సినిమాకు సంబంధించిన తుది మెరుగులు దిద్దుతూ ఉండడం వల్ల వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా  తెరకెక్కడంతో ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంశాలు కలిగి ఉన్నాయి,  ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి,  ఇప్పటి వరకు వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: