కొంత మంది
హీరోయిన్ లకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమాతో మంచి గుర్తింపు లభించకపోయినప్పటికే ఆ తర్వాత మాత్రం మంచి విజయాలు లభిస్తుంటాయి, అలా మంచి విజయాలు లభించినప్పటికీ కొంత మంది
హీరోయిన్ లకు మాత్రం ఆ తర్వాత పెద్దగా అవకాశాలు ఇండస్ట్రీలో లభించవు, అలాంటి ముద్దుగుమ్మలో
హెబ్బా పటేల్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ
హెబ్బా పటేల్ 'అలా ఎలా' అనే ఒక చిన్న సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది, ఈ
సినిమా ఈ ముద్దుగుమ్మకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలా ఎలా సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కు
కుమారి 21 ఎఫ్ సినిమా అవకాశం దక్కింది, ఈ
సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం తో హెబ్బా
పటేల్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది, ఈ
సినిమా ఇచ్చిన
జోష్ లో
హెబ్బా పటేల్ వరుస సినిమాల్లో నటించింది.
కాకపోతే ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమాలు ఏవి పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతం కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ సినిమాల స్పీడ్ కాస్త తగ్గింది, ఆ మధ్యలో
హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన
ఒరేయ్ బుజ్జిగా సినిమాలో నటించి మెప్పించింది, ఇది ఇలా ఉంటే
హెబ్బా పటేల్ ప్రస్తుతం ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది, హెబ్బా
పటేల్, రామ్ కార్తీక్ జంటగా ఈ
మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తెలిసినవాళ్ళు అనే టైటిల్ ని పెట్టారు, ఈ సినిమాకు ఫ్లవన్ కోనేటి దర్శకుడు, ఈ
సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ
మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ
సినిమా ఫిలిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి, ఈ
సినిమా విజయం సాధించినట్లే అయితే
హెబ్బా పటేల్ తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.