పవన్
కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా
నాయక్ సినిమా మూడు రోజుల్లోనే ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ
సినిమా మెజారిటీ ప్రేక్షకులు ఈ
సినిమా తొలి రోజే చూడాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఇంకొంతమంది ఈ
సినిమా యొక్క ట్రైలర్ చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా లేదు అని కొందరు అంటుంటే మరి కొందరు ఒరిజినల్ వెర్షన్ సినిమాలోని క్లాస్ టచ్ ఈ సినిమాలో మిస్స్ అవుతుందని చెప్తుండడం మరొక కారణం. అందుకే ఈ
సినిమా యొక్క ఇమేజ్ ఎప్పుడు అందరిలో అనుమానం ఏర్పడింది.
ఒరిజినల్ సినిమాలో పవన్ పాత్రను బిజూ
మీనన్ అనే మలయాళ నటుడు చేశాడు ఆ సినిమాలో ఆయన పాత్రను చాలా క్లాస్ గా చూపించారు. నటన విషయంలోనూ ఎంతో హుందా నటనను కనబరిచారు ఆయన. అయితే దానికి పూర్తి విరుద్ధంగా పవన్ పాత్ర తెలుగులో నిర్వహించబడింది. ఆయన యాక్టింగ్
మాస్ గా ఉండడం జరుగుతుంది. దాంతో ఆ పాత్రకు ఈ పాత్రకు పోలికే లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పవన్
కళ్యాణ్ కూడా డిఫరెంట్ గా చేయడం ఈ సినిమాకు ఎంత వరకు కలిసి వస్తుందో అన్న అనుమానాలను
సినిమా అభిమానులు కలిగిస్తున్నారు.
ఇకపోతే మలయాళ దర్శక
రచయిత సాచీ కూడా మలయాళ ప్రేక్షకులు క్లాస్ గా సెటిల్ గా ఉండే పాత్రను ఇష్టపడతారు కాబట్టి ఆ విధంగా ఆ సినిమాను ఆ సినిమాలోని పాత్రలను తీర్చిదిద్దాడు. తెలుగులో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను చూడటానికి ఇష్టపడతారు. కానీ అందరికీ ఈ విధమైన క్లాస్ సినిమాలు నచ్చవు కాబట్టి
మాస్ పాత్రలే మెప్పిస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు ఈ విధంగా ఆలోచించి ఉంటారని కొంత మంది ప్రేక్షకులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
త్రివిక్రమ్ సాగర్ చంద్ర కలిసి పవన్ పాత్ర కు
మాస్ టచ్ ఇచ్చి దానికి తగ్గట్లుగా ఎలివేషన్ పెంచారు. మరి థియేటర్లో దీనికి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో చూడాలి.