ప్రస్తుతం
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఉంది రశ్మీక మందన్న.
యువ హీరోలతో నటిస్తూ కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టిన ఈ కథానాయిక పాలపుంతలా మెరుస్తూనే ఊరించే అందాలను కలిగి ఉంది. ఈమె దోచుకోని తెలుగు యువత లేదు అంటే అతిశయోక్తి కాదు ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ అందరి చూపు తన వైపు ఉండేలా చేసుకుంటూ ఉండటం ఒక ప్రత్యేకత. చిన్న సినిమాలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు లో ఓ చిన్న
సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ అమ్మాయికి తెలుగులో భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది.
గీత గోవిందం
సినిమా ద్వారా ఈమె స్టార్
హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది అనే చెప్పాలి. మధ్యలో రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ వెంటనే సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ వంటి సినిమాలతో కవర్ చేసుకొని టాప్ హీరోయిన్ల రేసులో ముందుకు దూసుకు పోయింది. ఈ రెండు సినిమాలు ఆమె క్రేజ్ ను మరింతగా పెంచాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఆమె
హీరోయిన్ గా చేసిన పుష్ప చిత్రం ఆమెకు భారీ స్థాయిలో పేరు, క్రేజ్ వచ్చేలా చేసింది.
ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలను చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ మరిన్ని అవకాశాలు అందుకోవడానికి పుష్ప
సినిమా ఇమేజ్ బాగా ఉపయోగపడింది. అలా ఒకేసారి రెండు చోట్ల క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో మంచి మంచి
సినిమా అవకాశాలు అందుకుంటుంది. అలా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. శర్వానంద్ సరసన కథానాయికగా చేసిన ఈ
సినిమా మార్చి 4వ తేదీన విడుదల కాబోతున్న
కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. అలా ఇప్పుడు తెలుగులో
హీరోయిన్ అందుకొని పారితోషకాన్ని అందుకుంటూ ఏ
హీరోయిన్ కు రాని అవకాశాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.