టాలీవుడ్
సినిమా పరిశ్రమలో హీరోగా నటుడిగా దగ్గుపాటి
రానా కు మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న కొన్ని క్రేజీ సినిమాలలో ఒకటి భీమ్లా నాయక్. పవన్
కళ్యాణ్ హీరోగా నటించిన ఈ
సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ వ్యవహరిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఇన్ని విశేషాలు కలిగిన ఈ
సినిమా చూడాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో
ఫిబ్రవరి 25వ తేదీన
మాస్ జాతర షురూ అవడం విశేషం.
మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పన్ కోసియం చిత్రానికి
రీమేక్ గా తెలుగు లో ఉన్న ఈ చిత్రం భారీ స్థాయిలో అంచనాలు కలిగి ఉన్న సినిమానే అయినా కూడా మలయాళ సినిమాలో లాగా ఈ చిత్రానికి రెండో
హీరో కి అంత ప్రాధాన్యత లేదని మొదట్లో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ల ను బట్టి అర్థం అయింది. పేరుకే ఈ సినిమాలో
హీరో ఉన్నాడు కానీ ఆయనను పెద్దగా ఎలివేట్ చేయకుండా ఇది పూర్తిస్థాయి పవన్
కళ్యాణ్ హీరో సినిమానే అన్నట్లుగా ఎలివేట్ చేశారు. ఆ విధంగా
రానా పాత్రకు పెద్దగా పేరు రాకుండా పోయింది.
దాంతో ఇప్పుడు
రానా కెరీర్ ఏమైపోతుందో అన్న అనుమానం ప్రేక్షకుల్లో నెలకొంది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
ప్రొడ్యూసర్ సూర్యదేవర నగవంశి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అన్నీ తానే అయి త్రివిక్రం ముందుకు నడిపించారు అయితే గతంలో రానాకు ఎలివేషన్ ఇవ్వలేదని కామెంట్ చేసిన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ట్రైలర్ విడుదల తర్వాత రానాకు ఇచ్చిన ప్రాధాన్యతను గమనించిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆ విధంగా పవన్ తో పాటు
రానా కూడా హైలెట్ అయ్యే విధంగా ఈ
సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
రానా సంబంధించిన పిక్స్ ని కట్ చేసిన ఆయన ఫ్యాన్స్ కొంతమంది సెలబ్రేషన్ 3 లోకి వెళ్లి పోతున్నారు.