టాలీవుడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన కెమిస్ట్రీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ తొలిసారి కలిసి 'గీతగోవిందం' సినిమా తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమాలో కలిసి నటించారు ఈ జంట. ఈ సినిమాలో కూడా ఇద్దరు మంచి కెమిస్ట్రీని పండించారు. ముఖ్యంగా సినిమాలో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
ఇక అప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్యా ఏదో ఉందనే పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.దానికి తగ్గట్లుగానే కొంతకాలంగా అటు రష్మిక కూడా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కి చాలా దగ్గర అవుతూ వస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్కు రష్మిక హాజరు అవుతుంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలు దేవరకొండ బ్రదర్ తో కలిసి గోవా లో జరుపుకుంది రష్మిక మందన. అంతేకాకుండా రష్మిక, విజయ్ దేవరకొండ ముంబైలో డేటింగ్ కి, షాపింగ్ కి వెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక ముంబైలో ఓ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది.
అంటే విజయ్ దేవరకొండ ఎక్కడుంటే రష్మిక అక్కడ ఉంటుంది. షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు వెంటనే విజయ్ దేవరకొండ వద్దకు వాలిపోతుంది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని నెటిజెన్స్ అంటున్నారు. ఇక ఇప్పుడేమో ఏకంగా ఈ జంట ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు అటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక మందన కానీ ఆ మధ్య ఉన్న రిలేషన్ గురించి నోరు విప్పలేదు. మరి ఈ ఏడాది చివర్లో ఈ జంట నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్న లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే...!!