తన మార్ఫింగ్ ఫొటోస్ చూసి షాక్ అయిన అనుపమ..!!

murali krishna
ప్రేమమ్‌ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ వరుస ఆఫర్లతో బాగా దూసుకుపోతుంది.

నటను ప్రాధాన్యమున్న ప్రాతలను ఎంచుకున్న అనుపమ తాజాగా మోస్ట్‌ రొమాంటిక్‌గా మారిపోయి కుర్రకారు గుండెల్లో గుబులురేపుతోందట. ఫిబ్రవరి 18న పుట్టిన కోలకళ్ల కేరళ కుట్టికి హ్యాపీ బర్త్‌డే కాగా, ఆమెకు నెటిజన్స్, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారట  


అనుపమ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుందట.. ఈ మలయాళీ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు త్రివిక్రమ్ మూవీ అఆతో పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ అలాగే కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటించి ఆకట్టుకుందట.. ఇప్పుడు తెలుగులో ఈమె నటించిన 18 పేజీస్ విడుదలకు సిద్ధంగా ఉండగా కార్తికేయ 2 మరియు బటర్ ఫ్లై చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయట.

వరుస తెలుగు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకి అనుకోని షాక్ తగిలిందట.. అది కూడా హ్యాకింగ్ రాయుళ్ల కారణంగా. అసలు విషయమేమంటే, అనుపమ పరమేశ్వరన్ ఫేస్ బుక్‌ను కొన్నాళ్లు ముందు హ్యాక్ చేశారు. అందులో వాళ్లు కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను చూసి అనుపమ పరమేశ్వరన్ షాకైందట..

వెంటనే అనుపమ సైబర్ క్రైమ్‌ను పోలీసులను ఆశ్రయించింది. అయితే కొందరు అనుపమను కామెంట్స్ రూపంలో ఇబ్బంది పెట్టసాగారట.అయితే ఈ కామెంట్సకు అనుపమ ఘాటుగా రియాక్ట్ కావడంతో కామెంట్స్ ఆగిపోయాయని తెలుస్తుంది.. రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు సోషల్ మీడియా హ్యాకింగ్ వల్ల కలిగిన ఇబ్బందిని వివరించిందట. ఇది విని అందరు కూడా అవాక్కవుతున్నారు.పాపం అనుపమ కు వచ్చిన కష్టం చూసి ఆమె ఫ్యాన్స్ తెగ భాధ పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: