మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మెగా మల్టీస్టారర్ సినిమాను హిందీలో కూడా విడుద ల చేయబోతున్నారు. హిందీలో ఈ సినిమాను పెన్ స్టూడియోస్ వారు విడుదల చేయబోతుండగా దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా వదలగా అక్కడి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారట అయితే మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లో సినిమాలు చేయడం కొత్త కాకపోయినా కూడా ఇప్పటి తరం ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియకపోవచ్చు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలీవుడ్ లో పరిచయం అయిన హీరో రామ్ చరణ్ ద్వారా ఈ చిత్రం ను పాపులర్ చేసే విధంగా అక్కడ నిర్మాణసంస్థ భావిస్తోందట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ మరియు పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో ఓ అద్భుతమైన స్పెషల్ సాంగ్ చేసి తన అందాలను పరిచింది రెజినా.
కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాత్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించిన గా గత ఏడాది మేలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది అయితే కరుణ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు మార్చి 25వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్ అధికారికంగా ప్రకటించారు. దేవాదాయ భూముల ఆక్రమణలు నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి కొరటాల శివ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇద్దరు హీరోలు కూడా నక్సలైట్లు గా కనిపించబోతున్నారు మణిశర్మ సంగీతం లో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టించి రికార్డులను తిరగారస్తుందో చూడాలి