ఆ హీరోయిన్తో ప్రభాస్ డేటింగ్.. కానీ అది నచ్చక విడిపోయారట?

praveen
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. టాలీవుడ్లో ఈ డేటింగ్ ట్రెండ్ కాస్త తక్కువగా ఉంటుంది. కానీ అటు బాలీవుడ్ లో మాత్రం పెళ్లయిన వారు పెళ్లి కాని వారు అనే తేడా లేకుండా..  వయస్సుతో సంబంధం లేకుండా డేటింగ్లో మునిగి తేలుతుంటారు హీరో హీరోయిన్లు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డేటింగ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

 పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఎంతో సింపుల్గా ఉంటాడు. ఎక్కడ స్టార్ హీరో అనే దర్పాన్ని ప్రదర్శించడడూ.. అందుకే ప్రేక్షకులందరికీ కూడా ప్రభాస్ డార్లింగ్ గా మారిపోయాడు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒక హీరోయిన్ తో డేటింగ్ చేశాడని.. కానీ చివరి నిమిషంలో బ్రేకప్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరోయిన్ తో కలిసి ప్రభాస్ దాదాపు రెండు సినిమాల్లో నటించాడట. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.

 ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్లో మునిగి తేలాడట. కొన్ని రోజుల పాటు వీరిద్దరి డేటింగ్ కి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక వరుస సినిమాలతో ఆ హీరోయిన్ బిజీగా ఉండడంతో ప్రభాస్ను పట్టించుకోలేదని దీంతో హీరోయిన్ వ్యవహారశైలి నచ్చక ఇక ప్రభాస్ కూడా హీరోయిన్ కి బ్రేక్ అప్ చెప్పేశాడట. ఇక ఇప్పుడు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేటింగ్ అమ్మాయిలు అనే విషయాన్ని కూడా దాదాపు మర్చిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: