కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చిన ''భీమ్లా నాయక్'' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహా శివరాత్రి పండుగ వారంలో ఫిబ్రవరి 25 వ తేదీన తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటోంది. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాని మల్టీస్టారర్ గా ప్రమోట్ చేయకపోవడంపై దగ్గుబాటి ఫ్యాన్స్ పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' సినిమాకి అధికారిక తెలుగు రీమేక్. అక్కడ బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన రిటైర్డ్ హవల్దార్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు.నిజానికి మలయాళంలో ఇద్దరు హీరోల పాత్రలకు ఈక్వెల్ ప్రాధాన్యత ఉంటుంది.
సమజ్జీవులైన ఇద్దరు వ్యక్తుల మధ్య అహం ఆత్మాభిమానం వల్ల తమ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులే ఈ సినిమా యొక్క కథాంశం. అసలు ఒకరికొకరు ఎక్కడా తగ్గకుండా వారి ఇద్దరి పాత్రలు నువ్వా నేనా అన్నట్లు ఈ సినిమాలో పోటీపోటీగా ఉంటాయి. అందుకే రెండు పాత్రల పేరులు వచ్చే విధంగా 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టారు.కానీ ఇక్కడ తెలుగు రీమేక్ విషయానికి వస్తే మాత్రం దీన్ని మల్టీస్టారర్ గా కాకుండా.. ఇది కేవలం పవన్ కళ్యాణ్ సోలో సినిమా అనేలా మార్చేశారని మొదటి నుంచీ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ పోషించిన 'భీమ్లా నాయక్' పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడంతో అందరూ కూడా ఇది మల్టి స్టారర్ కాదనే ఓ ఐడియాకి వచ్చారు. సినిమా బిజినెస్ ను మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని ఇక్కడ సర్దిచెప్పుకోవచ్చు.కాకపోతే సినిమా ప్రమోషన్స్ లో కూడా రానాకు పాపం ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా చేయడం.. కనీసం దీన్నొక మల్టీస్టారర్ గా కూడా జనాల్లోకి తీసుకెళ్లకపోవడంపై దగ్గుబాటి అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు.