సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 'అరబికుత్తు సాంగ్'..!

Anilkumar
దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం బీస్ట్.అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. అయితే గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి.


ఇటీవల రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇప్పుడు విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.ఇక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే బీస్ట్‌ మూవీ యూనిట్‌ తాజాగా సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసింది. కాగా వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్‌ సినిమాలోని ‘అరబికుత్తు’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.


 ప్రస్తుతం పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.అయితే 'అరబికుత్తు' సాంగ్‌ రిలీజ్‌ చేసిన 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షకులు వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది.ఈ పాట 2.5 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రస్తుతం ఇప్పుడు ఈసాంగ్ 47 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక  ఈ పాటలో విజయ్ , పూజ స్టెప్స్ కు వీరి  ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అయితే చాలా కాలం తర్వాత తమిళ్ లో నటిస్తుంది పూజ హెగ్డే.ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు.ఇక ఈ సినిమా అనంతరం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు విజయ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది...!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: