సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది
హీరోయిన్ లు ఉంటారు, కానీ వారిలో కొంతమందికి మాత్రమే ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది, అలా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందిన
హీరోయిన్ లలో కీర్తి సురేష్ ఒకరు. అందాల ముద్దుగుమ్మ
కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ
మూవీ మంచి విజయం సాధించడంతో
కీర్తి సురేష్ కు తెలుగునాట మంచి అవకాశాలు దక్కాయి. అయితే ఆ తర్వాత
కీర్తి సురేష్ నటించిన
మహానటి సినిమా మంచి విజయం సాధించడంతో పాటు
కీర్తి సురేష్ కు మంచి పేరు తీసుకువచ్చింది, ఆ తర్వాత
కీర్తి సురేష్ అనేక
టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది, ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా అనేక కొలివుడ్ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇలా ఇటు
టాలీవుడ్ అటు
కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న
కీర్తి సురేష్ ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది, కొన్ని రోజుల క్రితం విడుదల అయిన
తమిళ సినిమా అన్నాత్తే లో రజనీకాంత్ కు చెల్లెలు గా నటించిన
కీర్తి సురేష్ ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం
కీర్తి సురేష్ తెలుగులో
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా
శంకర్ సినిమాలో
చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది, అలాగే మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో
కీర్తి సురేష్, మహేష్ బాబు సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా
టాలీవుడ్ మాత్రమే కాకుండా
కోలీవుడ్ లో కూడా సాని కాయుధం అనే సినిమాలో
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోంది, ఇలా
కీర్తి సురేష్ ఇటు
టాలీవుడ్ అటు
కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.