సర్కారు వారి పాట మరో పోకిరి అవ్వడం పక్కా అట..

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ ఇక ఇటీవలే ప్రారంభం అయ్యింది.ఇక హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర ఏంటీ.. అసలు మహేష్ బాబు పాత్రకు బ్యాంకింగ్ రంగానికి ఉన్న సంబంధం ఏంటీ అనే విషయాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.ఇప్పటి దాకా మహేష్ బాబు పాత్ర ఏంటీ.. ఆయన పాత్ర పేరు ఏంటీ అనే విషయాలను కూడా మేకర్స్ అసలు రివీల్ చేయలేదు. కాని తాజాగా రిలీజ్ అయిన కళావతి పాట కు లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ ని చేశాడు.



ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర చాలా కేర్ లెస్ గా.. ఏమాత్రం సమాజం గురించి పట్టనట్లుగా ఉంటుందట. అమ్మాయిలు ప్రేమ గురించి పట్టించుకోని వ్యక్తిగా ఇందులో మహేష్ బాబు కనిపిస్తాడట.ఇక అలాంటి ఓ వ్యక్తికి హీరోయిన్ కళావతి కనిపించిన వెంటనే గుండెల్లో కొత్త ఆలోచనలు మొదలు అవ్వడం ఇంకా ఆమె హగ్ ఇవ్వడంతో మతి పోయి ప్రేమలో పడటం జరుగుతుందట.ఇక మొదటి సారి హీరోయిన్ కళావతి హీరోకు హగ్ ఇచ్చిన సమయంలోనే ఈ పాట ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక అనంత శ్రీరామ్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమాలో హీరో పాత్ర పోకిరి సినిమాలో హీరో పాత్ర తరహాలో ఉందనే సమాచారం వినిపిస్తుంది.



దర్శకుడు పరశురామ్ తో పాటు ఇతర సినిమా యూనిట్ సభ్యులు సినిమా గురించి మాట్లాడిన సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర పోకిరి సినిమాలో పండుగాడు తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు.అలాగే మహేష్ బాబు కూడా గతంలో బిగ్ సి మొబైల్స్ లాంచ్ అప్పుడు ఈ సినిమా పోకిరి రేంజిలో ఉంటుందని చెప్పాడు. ఇక ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో పోకిరి లాంటి మాస్ సినిమా కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా మరో పోకిరి లాంటి హిట్ అవుతుందో లేదో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: