షాక్: గంగూభాయ్ మూవీ విడుదలకు అడ్డుపడుతున్న కొడుకు.. కారణం..?
ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన గంగూ భాయ్ కుటుంబం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గంగూభాయ్ తనయుడు బాబు రావుజీషా, మనవరాలు ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన అమ్మను ఒక వేశ్య గా ఈ సినిమాలో చూపిస్తున్నారని.. ప్రజలు ఇప్పుడు తన తల్లి గురించి చెప్పుకోలేని మాటలు మాట్లాడుతున్నారని బాబు రావుజీ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కేవలం కలెక్షన్లు రాబట్టే కోసమే తన తల్లి పరువు తీశారు అంటూ గంగూభాయ్ కొడుకుతో పాటు మనవరాలు కూడా ఈ సినిమా మేకర్స్ పై విరుచుకు పడినట్లు సమాచారం. కేవలం డబ్బుపై వ్యామోహం తోనే తన కుటుంబం గురించి ఇందులో తప్పుగా చూపిస్తున్నారని దానిని మేము అంగీకరించలేదని తెలియజేశారు.
అయితే ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు తన కుటుంబం అనుమతి తీసుకోలేదని.. తన అమ్మమ్మ జీవితంలో ఎన్నడూ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేయలేదని ఆమె పేర్కొంది. అయితే గత సంవత్సరం కూడా ఈ సినిమాపై బాబు రావూజీ షా కోర్టులో కేసు వేయగా సంజయ్ లీలా భన్సాలి- ఆలియా భట్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆలియా భట్ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదల ఆపివేయడం పై బాంబే హైకోర్టు కొట్టివేసింది.