పవన్ సినిమా కు లైన్ క్లియర్.. అవన్నీ రూమర్సే!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా ను త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్న ఈ సినిమా కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ఈ సినిమా లో విలన్ గా రానా నటిస్తూ ఉండడం సినిమాపై అంచనాలను పెంచింది. పవన్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ను చేస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా కొన్ని రోజులుగా ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఈ సినిమా ఆగిపోయింది మళ్ళీ తెరకెక్కడం కష్టమని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో దీనిపై పెరిగిపోతున్న పుకార్లను దృష్టిలో పెట్టుకున్న చిత్ర బృందం ఈ సినిమా మొదలు కాబోతుంది అని ఓ హింట్ ఇచ్చింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలిపింది. దీంతో పవన్ అభిమానులలో సంతోషం మాములుగా లేదు.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తుందని అంటున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగవద్గీత అనే సినిమా లో చేస్తున్నారు. అంతేకాదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండిటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. ఎప్పుడు షూటింగ్  కి వేలతాయో చూడాలి. ఇకపోతే సాయి ధరం తేజ్ తో కలిసి ఆయన ఓ రీమేక్ సినిమా లో కూడా చేయబోతున్నాడు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వరకు ఎన్ని సినిమాలు చేస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: