అందాల ముద్దుగుమ్మ మీనాక్షి
చౌదరి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే విషయాన్ని సాధించుకుంది, ఈ
సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ
మాస్ మహారాజా
రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమాలో
హీరోయిన్ గా నటించింది, ఈ
సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు
థియేటర్ ల దగ్గర పాజిటివ్ టాక్ దక్కింది, ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఖిలాడి సినిమాలో
హీరోయిన్ లుగా నటించిన మీనాక్షి
చౌదరి, డింపుల్ హయాతి లలో ఒకరికి మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం దక్కింది అటు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, ప్రస్తుతం మీనాక్షి
చౌదరి ఇతర ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన
గద్దల కొండ గణేష్ సినిమాలో జరా జరా అనే స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకుల మనసు దోచుకున్న డింపుల్ హయాతి ఈ సాంగ్ ద్వారా
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఆ తర్వాత డింపుల్ హయాతి, రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి
సినిమా లో
హీరోయిన్ గా నటించింది , ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అందచందాలతో ప్రేక్షకులను
ఫిదా చేసింది, తన అందచందాలతో ప్రేక్షకులను
ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మకు గోపీచంద్,
శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా ఖిలాడి
సినిమా ద్వారా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు క్రేజీ
సినిమా ఆఫర్ లు వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.