మాస్ మహారాజా
రవితేజ క్రాక్
సినిమా సక్సెస్ తర్వాత ఖిలాడి
సినిమా భారీ అంచనాలతో
ఫిబ్రవరి 11న విడుదలైంది.అయితే
రవితేజ నటించిన ఈ సినిమాకు ఊహించిన టాక్ రాలేదు.ఇక రమేశ్
వర్మ తెరకెక్కించిన ఈ సినిమా... విడుదలైన మొదటి రెండు రోజుల్లో 7 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది.
రవితేజ నటించిన ఈ
సినిమా మరో 15 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ ఈయన
సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. ఇక ఇదిలా ఉంటె సోషల్ మీడియాలో ప్రచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని అంటున్నారు.అయితే ఖిలాడి సినిమాకు సీక్వెల్ వస్తుందనే ప్రచారంలో నిజం ఉందని అనిపించకపోదు.
ఇక ఈ సినిమాను దర్శకుడు రమేష్
వర్మ క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంది అన్నట్టుగానే ముగించాడు . అయితే
మాస్ మహారాజా
రవితేజ కిలాడి
సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా కథ కూడా పూర్తి కాలేదు. అయితే ఈ సినిమాలో
రవితేజ క్యారెక్టర్ ఏంటంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఇక
సినిమా కథ ఏంటంటే 10 వేల కోట్లు కొట్టడానికి తన టీంతో కలిసి
రవితేజ ఏం చేశాడు.. చివరికి ఆ డబ్బును ఎలా సొంతం చేసుకున్నాడు అనేదే. అంతేకాకుండా అక్కడక్కడా
తమిళ సినిమాలు సతురంగ వెట్టై, మంగత్త ఛాయలు ఇందులో కనిపిస్తుంటాయి.
అయితే విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో
సినిమా అంచనాలు అందుకోలేకపోయిందని. ఇదిలా ఉంటే ఈ
సినిమా రవితేజ ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చేసింది. ఇక తాజాగా అందుతున్న దాని ప్రకారం
సినిమా దర్శకుడు రమేష్
వర్మ ఈ సినిమాకి సిగ్నల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ సీక్వెల్ కోసం
రవితేజ ఒప్పుకుంటాడా లేదా అన్న విషయం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి
చౌదరి హీరోయిన్ గా నటించడం జరిగింది. అంతేకాకుండా జబర్దస్త్ యాంకర్
అనసూయ ఒక కీలక పాత్రలో అందరిని ఆకట్టుకుంది.