ఇక యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఇన్ స్టా గ్రామ్..ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్ లలో ఖాతా లు ఉన్నా అవి కేవలం పేరుకే. అంతగా యాక్టివిటీ ఆయన కొనసాగించరు.ఇక సినిమా అప్ డేట్స్ కూడా అయన పెద్దగా రివీల్ చేయరు. చాలా అరుదుగానే పోస్టులు ఉంటాయి. తాజాగా చై ఇన్ స్టాలో ఓపీస్ ఫుల్ ఫోటోని పోస్ట్ చేసారు.సాయంకాలం సంధ్యా వేళలో బీచ్ అందాల్ని కవర్ చేస్తూ ఓ ఫోటో తీసి దాన్ని తన ఇన్ స్టాలో ఆయన పోస్ట్ చేసారు. అస్తమిస్తోన్న సూర్యుడు పసుపు వర్ణంలో ధగధగలాడుతో కిరణాలు సముద్రంలో పడుతుని ఉండగా కెమెరా తో ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేసారు.ఇక ఆ సముద్రం ఒడ్డుకి చేరుకుంటోన్న పడవల సమూహం ఆహ్లాదరకమైన వాతావరణాన్ని తన కెమెరాలో ఆయన బంధించాడు.
ఇక ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో బాగా వైరల్ గా మారింది. మరి ఈ ఫోటో ఏ బీచ్ నుంచి తీసింది? అనే వివరాలు అయితే ఇంకా రివీల్ చేయలేదు.నాగ చైతన్య అభిమానులు ఆ ఫోటోని ఉద్దేశించి పలు కామెంట్లు చేస్తున్నారు. అయితే చై ఇలా ఫోటోని షేర్ చేయడంపై తన సంతోషాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక సమంత తో విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా మౌనంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన అసలు ఎలాంటి కామెంట్లు చేయలేదు. సమంత పోస్ట్ ల్ని కూడా ఉద్దేశించి ఆయన స్పందించింది లేదు. ఇప్పుడిలా తన ఇన్ స్టా ద్వారా అభిమానులకు టచ్ లోకి రావడంతో మనసుకు తగలిని గాయం నుంచి బయటపడినట్లుగా ఆయన అభిమానులు భావిస్తున్నారు.ఇక నాగ చైతన్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి ఫాంలో వున్నాడు..