విష్ణు 'నో ' అంటే ఆ సినిమా చేసేవాడ్ని కాదు.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..!

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదల కానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ..' జీవితంలో కొన్ని విషయాల్లో రిస్కు చేయాలని అన్నారు. నటుడిగా ఒక నిర్మాతగా తన కెరీర్ ఎలా ప్రారంభమైందో చెప్పారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పొట్ట చేత పట్టుకొని వచ్చాను. నటుడిగా నిర్మాతగా మంచి పేరు సంపాదించాను. అలా సంపాదించిన దాన్ని విద్యాసంస్థలకు ఖర్చు పెట్టాను. కులమతాలకు అతీతంగా కొంత మందికి ఉచిత విద్యాభ్యాసం అందిస్తున్నాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ 30 సంవత్సరాలు కష్టపడ్డాం. 


ఇప్పుడు అదొక విశ్వవిద్యాలయం అయింది. అంతకంటే విజయాల గురించి ఎక్కువగా చెప్పాలి అనుకోవడం లేదు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. సినిమా అంటేనే ఒక రిస్క్. నాకు ఎవరి ప్రోత్సాహం లేకున్న ధైర్యంతో నిర్మాతగా ముందడుగు వేసాను. అప్పట్లో సుందర్ అనే ఒక అగ్ర రచయిత ఉండేవారు. ఆయన నాకు ఏకంగా 50 కథలు చెప్పారు. వాటిలో ఏది నాకు నచ్చలేదు. చివరగా ఒక కథ చెప్పు అని అడిగా. చెప్పారు. అది నాకు బాగా నచ్చింది.ఇదే కథతో కన్నడలో సినిమా చేస్తే ఫ్లాప్ అయిందని ఆయన చెప్పారు. కానీ నేను మాత్రం ఈ సినిమా చేశా. సక్సెస్ సాధించా. ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డున పడాల్సిన పరిస్థితి.అందుకే అప్పుడప్పుడు రిస్క్ చేయాలని నేను నమ్ముతాను.


అలా రత్నబాబు కలిసి సన్ ఆఫ్ ఇండియా కథ చెప్పగానే ఓకే అన్నాను. వెంటనే విష్ణు కి ఫోన్ చేసి సన్ ఆఫ్ ఇండియా సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పాను. సాధారణంగా విష్ణు 'ఒకసారి ఆలోచిద్దాం నాన్న'.. అని అనేవాడు. కానీ ఆ రోజు ఏం మాట్లాడకుండా సన్ ఆఫ్ ఇండియా టైటిల్ లోగో క్రియేట్ చేసి పంపించాడు.ఆ రోజు విష్ణు 'నో ' అని ఉంటే ఈ సినిమా చేసే వాడిని కాదు. ఓ పవర్ఫుల్ కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక్క  పాట గ్రాఫిక్స్ కోసమే 1. 80 కోట్లు ఖర్చు పెట్టాం' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: