విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ లోనే సెటిల్ అవుతాడా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్ నేపథ్యంలోనే తన సినిమాలు చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబై లోనే జరగడం విశేషం. హైదరాబాదులో ఒక్కటంటే ఒక్క షాట్ కూడా చేయలేదు. దాంతో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలను కూడా అలానే బాలీవుడ్ నేపథ్యంలోనే చేస్తాడా అనే అనుమానాలు ఆయన అభిమానులలో ఎక్కువగా ఉంది.

దీని తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి జనగణమన సినిమా ఆయన చేస్తుండగా విదేశాలలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరగనుంది. మార్చి చివరిలో దీనికి సంబంధించిన షూటింగ్ చేయబోతున్నారట. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నడం విశేషం. దీంతో ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమా చేసే విధంగా ఓకే హీరో మరియు దర్శకుడు కలిసి మరొక సినిమాను షూటింగ్ దశకు తీసుకువెళ్లడం ఇండస్ట్రీలోని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

ఇదిలా ఉంటే పాన్ ఇండియా మార్కెట్ లో కి లైగర్ సినిమా ద్వారా భారీ స్థాయిలో ఎంట్రీ ఇస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సెన్సేషన్ కలిగించే చిత్రాన్ని చేసి అందరినీ ఆకట్టుకోవాలి అని చూస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని అయితే సృష్టించిందో అంతకుమించిన ప్రభంజనాన్ని పాన్ ఇండియా మార్కెట్లో చూపించాలని ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు చిత్రబృందం. మరి ఈ సినిమా విజయ్ పాన్ ఇండియా కెరీర్ ను నిర్ణయిస్తుంది కాబట్టి ఇది ఎంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇక ఆ తర్వాత కూడా అయన పెద్ద పెద్ద దర్శకులతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లు చేసే విధంగా ముందుకు పోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: