బాలయ్యా మజాకా.. 'అన్ స్టాపబుల్' ఖాతాలో భారీ రికార్డ్..!

Anilkumar
నందమూరి బాలకృష్ణ ఇటీవల తాజాగా హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' షో రికార్డులన్నీ బద్దలు కొడుతూ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళ్తోంది.  దూసుకెళ్లడమే కాకుండా పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచి ఆహా అన్పిస్తోంది.  ఇక ఇటీవల ఈ షో టీం ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు రెడ్ కార్పెట్ పరిచిన ఈ యూనిక్ టాక్ షో 40 కోట్ల నిమిషాలకు పైగా ప్రసారమై రికార్డు సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు. 


అయితే ఏదేమైనా బాలయ్య  'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్ రికార్డులను క్రియేట్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇక ఈ షోలో చివరగా మహేష్ బాబు ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే.బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రత్యేకతతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక ప్రేక్షకులనుండి విశేష స్పందన, ఆదరణను సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలయ్య సమయానుకూలమైన పంచ్‌లు, మంత్రముగ్ధులను చేసే హోస్టింగ్ నైపుణ్యాలు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'ని అత్యుత్తమ టాక్ షోలలో ఒకటిగా మార్చాయి.  ఇకపోతే  'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  


ఇక ప్రస్తుతం బాలయ్య 'అఖండ' విజయం తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.మరోసారి ఈ సినిమాలో భార్య ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది కర్ణాటక రాయలసీమ బార్డర్ నేపథ్యంలో సాగే కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: