నేటిజెన్ కామెంట్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నందితా శ్వేత..!

Pulgam Srinivas
సినిమా హీరోయిన్ లు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుతున్నారో మన అందరికీ తెలిసిందే, వారికి సంబంధించిన సినిమా విషయాలను,  ఇతర విషయాలను అలాగే హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే హీరోయిన్ లు ఎంతో మంది ఉన్నారు. సోషల్ మీడియా  ద్వారా వీరికి కొన్ని సందర్భాలలో మంచి జరిగినప్పటికీ కొన్ని సందర్భాలలో నెటిజన్ ల నుండి చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి, కొంతమంది నెటిజన్ లు హీరోయిన్ లు పోస్ట్ చేసిన ఫోటోలపై అసభ్యకరమైన కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు,  ఇలాంటి విషయాలను కొంత మంది హీరోయిన్ లు లైట్ తీసుకొని వారి పనిని వారు చేసుకుంటూ ఉంటారు.


 కానీ మరి కొంత మంది హీరోయిన్ లు మాత్రం అలాంటి నెటిజన్ లకు స్ట్రాంగ్  కౌంటర్ ఇస్తూ ఉంటారు, ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ నందితా శ్వేత కు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక నేటిజెన్ ద్వారా చేదు అనుభవం ఎదురైంది.  ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత  కూడా పర్వాలేదు అనే రేంజ్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది, ఇదిలా ఉంటే హీరోయిన్ నందితా శ్వేత  తాజాగా తన ఇన్‏స్టాలో లేటేస్ట్ ఫోటోస్ ను పోస్ట్ చేసింది.  నందితా శ్వేత పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు ఒక నేటిజెన్ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు,  నీ శరీరాకృతి చూసుకో.. నీ షేప్స్  చూసుకో.. కాస్త వర్కవుట్స్ చేయ్ అంటూ ఒక నేటిజెన్ అసభ్యకరంగా కామెంట్ చేశాడు, దీనితో ఆ నేటిజెన్ పై నందిత శ్వేత ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు ఎలా ఇలా ఉంటారు, నేను దేవతను కాదు, నేను కూడా మామూలు మనిషినే. అందరిలాగే నాకు కూడా బాధలు ఉంటాయి,  ఇలాంటి మాటలను ఎలా మాట్లాడుతారు. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను,  ప్రస్తుతం నేను ఎలా ఉన్నా,  దాన్ని నేను ఇష్టపడుతున్నాను అంటూ నందితా శ్వేత ఆ నేటిజెన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: