'ఒక్కడు' సినిమాలోని 9848032919 నంబర్ ఎవరిదో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో 'ఒక్కడు' సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి మహేష్ బాబు సినిమా కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎమ్.ఎస్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా భూమిక నటించగా.  ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించారు. ఇకపోతే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ ఎపిసోడ్ ఆడియన్స్ ను అప్పట్లో విపరీతంగా ఆకట్టుకుంది.


అయితే ఆ సన్నివేశంలో ధర్మవరపు తన ఫోన్ నెంబర్ '9848032919' అని చెబుతూ ఉంటాడు. అయితే ఆ నంబర్ ఎవరిది? ఆ సీన్లో ఆ నెంబరే ఎందుకు పెట్టారు? ఆ విషయమై డైరెక్టర్ ఏం ఆలోచించాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సినిమా కథలో భాగంగా మహేష్ బాబు భూమికను విదేశాలకు పంపించాలని అనుకుంటాడు. అలా పాస్ పోర్ట్ ఆఫీస్ లో ఉన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి పాస్ పోర్ట్ తీసుకునేందుకు వెళ్తాడు. అయితే పాస్ పోర్ట్ పోస్ట్ లో వస్తుంది అని చెప్తాడు. ఈ క్రమంలో తను బిజీగా ఉన్నానని అంటాడు. అదే క్రమంలో తన ఫోన్ నెంబర్ను గర్ల్ ఫ్రెండ్ కు చెబుతాడు.


ఆ సన్నివేశం సమయంలో ఫోన్ నెంబర్ ఎవరిది అయితే బావుంటుంది అని ఆలోచించుకుంటన్న క్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రొడ్యూసర్ ది అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారట. దాంతో ప్రొడ్యూసర్ నెంబర్ ని ఆ సన్నివేశంలో పెట్టేసారు. దీంతో సినిమాలో ఈ సన్నివేశం చాలా బాగా పండింది. ఇక సినిమాలో ఈ నెంబర్కు ఫోన్ చేసి మహేష్ బాబు, అతని ఫ్రెండ్స్ ధర్మవరపు సుబ్రహ్మణ్యంని ఎంతో విసిగిస్తూ ఉంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సినిమా విడుదలయ్యాక చాలామంది అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ నెంబర్కు ఫోన్ చేశారట. దాంతో ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు కొద్దిరోజులకే ఫోన్ నెంబర్ మార్చేశాడట.అంతే కాదు ఆ సమయంలో చాలామంది ఈ నెంబర్ అసలు రింగ్ అవుతుందా? లేదా? అని ప్రతిరోజూ ట్రై చేసేవారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: