టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీస్ ఫ్లేవర్..!
విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్లమ్‌డాగ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు నటిస్తున్నాడు విజయ్. ఇక ఈ మూవీలో బాలీవుడ్ అనన్యాపాండే హీరోయిన్గా చేస్తోంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. టాలీవుడ్‌కి ముంబాయి నుంచి హీరోయిన్లు చాలా సంవత్సరాలుగా వస్తున్నారు. అయితే అప్పట్లో హిందీలో పెద్దగా స్టార్డమ్ లేనివాళ్లే తెలుగు సినిమాలు చేసేవాళ్లు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. 'ప్రాజెక్ట్-కె' పేరుతో వస్తోన్న ఈ సినిమాని వరల్డ్ క్లాస్ పిక్చర్‌గా తెరకెక్కిస్తున్నామని చెప్పాడు నిర్మాత అశ్వనీ దత్. ఇక లార్జ్ స్కేల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్గా చేస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్‌ని కీ-రోల్ ప్లే చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' అనే పీరియాడికల్ డ్రామా రూపొందుతోంది. ఔరంగజేబు కాలంనాటి కథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవల్లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు మేకర్స్. అందుకే విలన్‌గా అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. నర్గీస్ ఫక్రీతో సెకండ్ హీరోయిన్ రోల్ చేయిస్తున్నారు.