మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమా ఈ ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కావడం కష్టమే అని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీ లో కూడా ఫిబ్రవరి 11 వ తేదీన భారీ ఎత్తులో విడుదల చేసే ప్లాన్ లో చిత్ర బృందం ఉంది. ఇక థియేటర్ లను కూడా ఇప్పటికే బుక్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది, ఇకపోతే ఇలా ఖిలాడి కి సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోవడంతో ఇక ఈ సినిమా వాయిదా పడే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఒకవైపు రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కాబోతుండగా మరో వైపు రవితేజ సమర్పిస్తున్న తమిళ డబ్బింగ్ ఎఫ్.ఐ.ఆర్ సినిమా కూడా అదే రోజు ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది, తమిళంలో రూపొందిన ఎఫ్ ఐ ఆర్ మూవీ ని తెలుగులో రవితేజ విడుదల చేయబోతున్నారు.
విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు మను ఆనంద్ దర్శకత్వం వహించగా విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లో స్వయంగా విష్ణు విశాల్ ఈ మూవీని నిర్మించాడు, ఇది ఇలా ఉంటే రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది, అలాగే రవితేజ సమర్పిస్తున్న ఎఫ్ ఐ ఆర్ సినిమా కూడా ఫిబ్రవరి 11 వ తేదీనే విడుదల కాబోతుంది, ఇలా ఒకే రోజు రవితేజ నటించిన సినిమా, రవితేజ సమర్పిస్తున్న సినిమా రెండూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నాయి.