నిజంగా ఈ రోజు తెలుగోడు గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజు అని చెప్పాలి. నేడు భారత ప్రధాని మంత్రి సైతం బహిరంగంగా తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునేలా చెప్పాడంటే తెలుగోడి స్థాయి ఏ స్థాయికి చేరిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా గత 90 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది.. మాస్టర్ కృష్ణారావు ప్రహ్లాదుడి గా వేషం కట్టి నేటికి 90 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి అవడంతో తెలుగోడి గౌరవం మరింత పెరిగిందనే చెప్పాలి. తెలుగు సినిమా 1921 - 1922 మధ్య కాలంలో మాటలు లేని మూగ సినిమా భీష్మ ప్రతిజ్ఞ చిత్ర నిర్మాణం మొదలైంది. అప్పటికి ఇది మొదటి సినిమా.. అంటే మాటలు లేని సినిమా మొదలై నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది.
అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మాటలు నేర్చాక వచ్చిన మొదటి పూర్తి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద. 1932 ఫిబ్రవరి 6వ తేదీ నాటికి అంటే సరిగ్గా నేటికి 90 సంవత్సరాలు పూర్తయింది అన్నమాట.. దాదాపు ఎన్నో వేలమంది శ్రమతో కష్టపడి సినిమా మీదే ప్రాణాలు పెట్టి నటించినందుకు గాను నేడు తెలుగుజాతి ప్రపంచ స్థాయికి చేరింది. అప్పుడెప్పుడే మాటలు లేని సినిమా కథ ను చెక్కిన తెలుగు జాతి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్ళు చూసే లాగా తెలుగువాడు అభివృద్ధి చెందాడు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అని చెప్పాలి..
ఏ సినీ ఇండస్ట్రీ చేయని ప్రయత్నం తెలుగు సినీ ఇండస్ట్రీ చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అంటే ఇది అని ఒక బ్రాండ్ ను సెట్ చేయడం జరిగింది. మొట్టమొదటి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి సినీ ఇండస్ట్రీలోకి ఒక సినిమాను తెరకెక్కించారు. నిజానికి 1895 డిసెంబర్లో ప్రపంచానికి సినిమా పరిచయం అయ్యింది. ఆ వెంటనే కేవలం ఆరు నెలల్లోనే పారిస్ నుంచి 1896 జూలై 7వ తేదీన బొమ్మ భారత్ కు చేరింది. 1896 సెప్టెంబర్ తొలి వారానికి మద్రాసు తీరాన్ని సినిమా చేరిందని చెప్పవచ్చు.. హాలీవుడ్ చిత్రాలను మూకీ చిత్రాలుగా విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించే వాళ్ళు..
అప్పట్లో 1897 సంవత్సరంలో విదేశీయులు మన దగ్గరకు వచ్చి లఘు చిత్రాలు తీయడం మొదలుపెట్టారు . 1899 నాటికి చిన్నగా మన వాళ్లు కూడా సొంతంగా షార్ట్ ఫిలిం తీయడం మొదలు పెట్టేశారు. 1910వ సంవత్సరంలో మన దేశీయులు పూర్తిస్థాయి మూకీ కథా చిత్రాలను నిర్మించడం మొదలుపెట్టారు.. భారతీయ సినిమాలు మొదలవ్వడం అందులో తెలుగు సినిమా మాత్రం 1921లో మూకీ డ్రామా గా తెరకెక్కడం జరిగింది.