RRR : జక్కన్న అందుకేనా అమెరికాను కూడా వదలడం లేదు..!!
ఇకపోతే తాజాగా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. జక్కన్న గీసిన ఈ చారిత్రక చిత్రం కోసం ఎంతో మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు విదేశాలలో కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల చేయడానికి అన్ని ప్రాంతీయ భాషలలో కూడా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే . ఇప్పుడు కూడా ఈ సినిమా విడుదల చేయడానికి ముందే అమెరికాలో కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక అమెరికాలో కూడా చిత్రం యూనిట్ అంతా కలిసి వెళ్లి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాను విజయవంతం చేయడానికి తమ వంతు సహాయంగా ప్రయత్నం చేయబోతున్నారు. అంతేకాదు ముంబైలో ఏర్పాటు చేసినట్లు గానే అమెరికాలో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి చాలా గ్రాండ్ గా ఈ సినిమా ప్రమోషన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కోట్ల రూపాయలను కొల్లగొడుతుంది ఈ సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఇలాంటి ప్లాన్ వేశాడని మరి కొంతమంది ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.