బీ టౌన్: దానికోసమే బయలుదేరుతున్న చెర్రీ..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఇక్కడ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఇతర భాషా సినీ ఇండస్ట్రీలో కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్ వైపు గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే అక్కడ ఫేమస్ డైరెక్టర్లతో చర్చలు నిర్వహించి అక్కడ కూడా స్టార్ హీరోలుగా చలామణి అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి బాలీవుడ్లో సక్సెస్ పొందారు అంటే పాన్ ఇండియా రేంజ్లో వారి రేటు పెరుగుతుంది కాబట్టి.. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి.. కాబట్టి చాలామంది సౌత్ సినీ ఇండస్ట్రీ ని విడిచి నార్త్ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు.


ఇలాంటి వారిలో మొదటి ప్రయత్నం చేసిన ప్రభాస్ సక్సెస్ పొంది ప్రస్తుతం రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా తన క్రేజ్ ను అమాంతం పెంచేస్తున్నారు. వీరి బాటలోనే కొత్తగా వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో కేవలం కొన్ని సినిమాలలో నటించి ఆయన వెంటనే బిటౌన్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం పాన్ ఇండియా  సినిమాలో నటించే క్రేజ్ ను సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న ఎన్టీఆర్ మంచి కథ కనిపిస్తే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ అందరికీ ఆయన హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే..

ఇదే బాటలోనే తాజాగా రామ్ చరణ్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక దర్శకుడి తో చర్చలు కూడా జరిపినట్లు , త్వరలోనే సినిమా కథ గురించి అలాగే అన్ని విషయాల గురించి వెల్లడిస్తామని కూడా ప్రకటించడం గమనార్హం. ఏదిఏమైనా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అంటే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రామ్ చరణ్ అక్కడ కూడా సక్సెస్ అయితే ఈయన రేట్ మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: