సినిమా కథలు కాదు.. యాడ్ కాన్సెప్టులు వెతుక్కోండి బాసు..!

shami
సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్స్ కు ఆ వెంటనే అడ్వర్టసింగ్ ఛాన్సులు వస్తాయి. స్టార్ గా ఎదగడమే ఆలస్యం వారి క్రేజ్ ని వాడుకోవాలని వాణిజ్యం సంస్థలు భావిస్తాయి. ఈ క్రమంలోనే రకరకాల యాడ్స్.. అందుబాటులో ఉన్న స్టార్స్ తో చేస్తూ వస్తారు. అయితే ఈ యాడ్స్ లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఆ స్టార్స్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా వాణిజ్య సంస్థలు వారికి అవకాశం ఇస్తాయి. సౌత్ లో యాడ్స్ లో నెంబర్ 1 అంటే అది సూపర్ స్టార్ మహేష్ అని చెప్పొచ్చు.

సినిమాలతో పాటుగా ఈక్వల్ గా మహేష్ యాడ్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తాడు. ఇప్పుడిప్పుడే మహేష్ తర్వాత అల్లు అర్జున్ యాడ్స్ చేస్తున్నారు. ఇదిలాఉంటే స్టార్ హీరోల యాడ్స్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మహేష్ బాబు పాన్ బహర్ కి బ్రాండింగ్ చేయడం పెద్ద హడావిడి చేశారు. అసలైతే మహేష్ ప్రమోట్ చేస్తున్నాడు కదా అని ప్రజలు అది టేస్ట్ చేయాలన్న రూల్ ఏమి లేదు. కానీ మహేష్ బ్రాండింగ్ చేయడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ జొమాటో యాడ్ కూడా వివాదానికి తెరలేపింది. సౌత్ సినిమాలను తక్కువ చేస్తూ అల్లు అర్జున్ మాట్లాడాడని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. స్టార్స్ తాము చేస్తున్న బ్రాండ్ గురించి  పట్టించుకుంటున్నారే తప్ప ఆ యాడ్ కాన్సెప్ట్ ఏంటి ఇది ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్తుంది అన్న విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. అందుకే స్టార్స్ చేస్తున్న యాడ్స్ పట్ల తెలుగు ఆడియెన్స్ నెగటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. బ్రాండింగ్ ఒప్పుకోవడం కాదు దానికి తగినట్టుగా ఆ యాడ్ కాన్సెప్ట్ కూడా తమ ఇమేజ్ కి తగినట్టుగా చూసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. యాడ్స్ చేస్తున్న స్టార్స్ ఈ ఒక్క విషయంలో క్లారిటీగా ఉండాల్సిందే మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: