తమిళ మీడియాలో సంచలనం..జైలర్ 2 చిత్రంలో పవన్ కళ్యాణ్.. ?
మొదటి భాగంలో ఉన్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా జైలర్ 2 లో కనిపించబోతున్నారు అలాగే జైలర్ 2 లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ లేదా బాలకృష్ణ గెస్ట్ పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటివరకు వార్తలు వినిపించాయి. కానీ షారుఖ్ ఖాన్ సినిమా డేట్ ల వల్ల ఈ సినిమాలో నటించలేకపోయారని బాలయ్య నటిస్తారనే విషయం కేవలం రూమర్లే అన్నట్లుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు తాజాగా తమిళ మీడియాలో వైరల్ గా మారిన ప్రకారం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు.
జైలర్ 2 సినిమాలో షారుక్ ఖాన్ చేయవలసిన పాత్రని పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని తెలిసి అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. పవర్ స్టార్, సూపర్ స్టార్ ఒకేసారి స్క్రీన్ పైన కనిపిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటూ పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా తమిళనాడులో ప్రచారాలు కూడా పెట్టారు పవన్ కళ్యాణ్. దీంతో అక్కడ కొంతమేరకు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి జైలర్ 2 సినిమాలో అన్ని అనుకూలించి నటిస్తే మాత్రం మరింత ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి